Bhadrachalam: గరిమెళ్లపాడు నర్సరీలోని ఎండిపోయిన చెట్లకు బహిరంగ వేలం
Bhadrachalam: కొత్తగూడెం గరిమెళ్లపాడు నర్సరీలోని 52 ఎండిపోయిన చెట్లకు నవంబర్ 6న వేలంపాట. వివర వెల్లడించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్.
Bhadrachalam: గరిమెళ్లపాడు నర్సరీలోని ఎండిపోయిన చెట్లకు బహిరంగ వేలం
భద్రాచలం: ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న కొత్తగూడెంలోని గరిమెళ్ళ పాడు వద్ద ఉపయోగంలో లేని మరియు ఎండిపోయిన చెట్లను వేలంపాట ద్వారా విక్రయించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంపాట ద్వారా కొనుగోలు చేయడానికి వచ్చే వ్యాపారులు ఈనెల 06 తేదీ నాడు గరిమెళ్ళపాడు ఉద్యానవన కేంద్రంలో జరిగే వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు.
వేలం పాటలో ఎండిపోయిన పనికిరాని చెట్లు అశోక, సర్వే, కేశవ, తమరిండ్, నిమ్మ,నేరేడు కలిపి 52 చెట్లు ఉన్నాయని ఆయన అన్నారు.




