Bhadrachalam: భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రావులపల్లి, మానే!

Bhadrachalam: భద్రాచలం నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, సీనియర్ నేత మానే రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 4 Nov 2026 9:11 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రావులపల్లి, మానే!

భద్రాచలం నవంబర్ 4: భద్రాచలం నియోజకవర్గ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, సీనియర్ నాయకులు మానే రామకృష్ణ సూచించారు.

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయడం, ఫోటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం వంటివి చేయవద్దని హెచ్చరించారు.

ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని మెచ్చా సూచించారు.అలాగే నియోజకవర్గంలోని BRS నాయకులు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉంటూ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem