Bhadrachalam: ఆశ్వయుజ బహుళ సప్తమి: గోదావరికి దివ్య హారతులు!

Bhadrachalam: భద్రాచలంలో ఆశ్వయుజ బహుళ సప్తమి సందర్భంగా గోదావరి నదికి వైభవంగా నదీహారతి సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల క్షేమం కోసమే ఈ పూజలని అర్చకులు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 1 Nov 2026 7:45 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ఆశ్వయుజ బహుళ సప్తమి: గోదావరికి దివ్య హారతులు!

భద్రాచలం, నవంబర్ 01: శ్రీ సీతారాముల వారి సన్నిధి ప్రముఖ దివ్య క్షేత్రం భద్రాచలంలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమి మహాముని, వరప్రదాయని గోదావరి నదికి శ్రీరామునికి ప్రీతికరమైన ఆశ్వయుజ బహుళ సప్తమి ఆదివారం నాడు నిర్వహించే గోదావరి నదీహారతినీ కనులారా వీక్షించే భక్తులకు ఎంతో ప్రతిష్టాత్మక మైనదని పురోహితులు రామ వజ్జల రవికుమార్ అన్నారు.

ఆదివారం నాడు గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరుగుతున్న నదిహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం గత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సుమారు సంవత్సరం కాలంగా శ్రీరామచంద్రునికి ప్రీతిపాత్రమైన ప్రతి ఆదివారం గోదావరి హారతులు సమర్పించడం జరుగుతుందని అన్నారు.

లోకకళ్యాణార్థం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలినోవా ప్రభావం నుండి తుఫానుల నుండి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దివ్య హారతులు సమర్పిస్తున్నట్లు ఆయన అన్నారు.

ముందుగా గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే వెలిగింప చేసి, భక్తులు స్పృశించిన పూజా ద్రవ్యాలతో, శ్రీరాముని కి, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు.

శాంతి మంత్ర పఠనం జరిపి గోదావరి హారతి కార్యక్రమాన్ని ముగించి రవికుమార్ లక్ష్మీదంపతులు, టీవీఎస్ ఎన్ రెడ్డి దంపతులు సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారని, పూజా సామాగ్రి భద్రాద్రి పురోహితుల సంఘం వారు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సత్య ప్రసాద్ శర్మ, రామాచార్యులు, తిరుపతిరావు, తేజ శర్మ, పీవీఎస్ఎన్ రెడ్డి హారతులు సమర్పించగా స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem