Bhadrachalam: యువత నేరాల బాట పట్టొద్దు: డీఎస్పీ అరుణ్‌కుమార్ పిలుపు!

Bhadrachalam: భద్రాచలంలో డీఎస్పీ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు జప్తు చేసి, గంజాయిపై హెచ్చరించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Updated on: 25 Oct 2026 10:35 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: యువత నేరాల బాట పట్టొద్దు: డీఎస్పీ అరుణ్‌కుమార్ పిలుపు!

Bhadrachalam: భద్రాచలం అక్టోబర్ 25-భద్రతా పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా భద్రాచలం పట్టణంలోని రాజుపేట కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కర్టెన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ స్థానికులకు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు, నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీయడంతోపాటు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. గంజాయిని సేవించినా, విక్రయించినా, సరఫరా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టగలమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

రాజపేట కాలనీలో తెల్లవారుజాము నుంచే పోలీసులు విశిష్టత కనిపించి పెట్టారు ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన గృహపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై సతపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఈ తనిఖీల్లో భద్రాచలం పట్టణ సీఐ సట్ల రాజు, ఎస్‌ఐలు సతీష్‌, రామకృష్ణ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ పడాల కేశవ్‌తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem