Bhadrachalam: భద్రాచలం గోదావరి వద్ద పటిష్ట బందోబస్తు!

Bhadrachalam: భద్రాచలం గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జన భక్తులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ అరుణ్ కుమార్ సూచన; 200 మందితో బందోబస్తు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 24 Sept 2026 8:56 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం గోదావరి వద్ద పటిష్ట బందోబస్తు!

Bhadrachalam: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీరామ దివ్య క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భద్రాచల పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు వేలాది సంఖ్యలో భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతంగా ఉండడంతో భక్తులకు ఎవరికి గోదావరికి వెళ్లడానికి వీలులేదని భద్రాచలం డిఎస్పి ఎం అరుణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం గోదావరి ప్రాంతంలో 200 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. వినాయకుడి విగ్రహాలను భద్రాచలం పట్టణంలోని సాయిబాబా గుడి పక్క నుంచి కరకట్ట మీదుగా గోదావరి వద్ధ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసిన వరకే పర్మిషన్ అని ఆయన తెలిపారు.

అక్కడి నుంచి గణనాథుడి విగ్రహాలను క్రేన్ ల ద్వారా లాంచిలో ఎక్కించి గోదావరి నిమజ్జనం చేస్తారని డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా గోదావరి పరిహార ప్రాంతంలో గత ఈతగాళ్లను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం కూడా ఉన్నారని తెలిపారు. మద్యం సేవించి ఎవరు కూడా గోదావరికి రావద్దని హెచ్చరించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem