Bhadrachalam: భద్రాచలంలో వైద్య శిబిరాలు, ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ భద్రాచలంలో వైద్య శిబిరాలు, స్కానింగ్ కేంద్రాలు, టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 6:00 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వైద్య శిబిరాలు, ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

భద్రాచలం: భద్రాచలంలో వైద్య శిబిరాల ఏర్పాట్లు, ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు మరియు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ గారు భద్రాచలంలో పర్యటించి గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్లను సందర్శించారు. పుష్కరాల సమయంలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయవలసిన వైద్య శిబిరాలు, వైద్య సిబ్బంది అందుబాటు, అవసరమైన వైద్య సదుపాయాల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు.

అదేవిధంగా భద్రాచలంలోని mims ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రిలోని పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టానికి సంబంధించిన స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, గుర్తించిన లోటుపాట్లపై సంబంధిత వారికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అనంతరంఎంపీ బంజ రప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సారపాక సబ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పిల్లలకు నిర్ణీత సమయంలో అన్ని టీకాలు అందించాలని, టీకాలు తీసుకోకుండా మిగిలిపోయిన (డ్రాప్ అవుట్) పిల్లలను గుర్తించి జాబితా తయారు చేయాలని, వారందరికీ 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రతాప్, డిపిఎంఓ మోహన్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM