Bhadrachalam: భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందడి షురూ

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖులు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 12 Nov 2026 6:44 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందడి షురూ

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పట్టణంలోని వ్యాపార వర్గాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.

భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం పలువురు వ్యాపారస్తులు వివిధ పదవులకు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి యశోద రాంబాబు, కొనిజర్ల ముక్తేశ్వరరావు నామినేషన్లు సమర్పించగా, కార్యదర్శి పదవికి కంభంపాటి సురేష్ కుమార్, ఇజ్జాడ బాబ్జిరావు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి తాండ్ర వెంకటరమణారావుకు అందజేశారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో కీలకమైన అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పలువురు వ్యాపార ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పట్టణ వ్యాపారుల సమస్యల పరిష్కారం, చాంబర్ అభివృద్ధి, వ్యాపార వర్గాల ఐక్యత వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయా

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem