Bhadrachalam: పాఠశాలకు బెంచీలను బహుకరించిన దాతలు
Bhadrachalam: భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం కాటాయగూడెం పాఠశాలకు ఉపాధ్యాయురాలు, లయన్స్ క్లబ్ సభ్యులు బెంచీలను బహుకరించారు.
Bhadrachalam: పాఠశాలకు బెంచీలను బహుకరించిన దాతలు
భద్రాచలం: దుమ్ముగూడెం మండలం , కాటాయగూడెం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు పాఠశాల ఉపాధ్యాయురాలు గంధం సునీత, ఆమె భర్త, లయన్స్ క్లబ్ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి గారు బెంచీలను బహుకరించారు.
ఈ బెంచీలను భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యాభ్యాస వాతావరణం కల్పించేందుకు బెంచీలను అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




