Bhadrachalam: భద్రాచలంలో నేడు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం!
Bhadrachalam: భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో గణపతి పూజలు; ఉంగరాల వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహణ.
Bhadrachalam: భద్రాచలంలో నేడు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం!
Bhadrachalam: భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ మజీద్ పక్కన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కా మహారాజ్ కమిటీ సభ్యులు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కుప్పాల నాగరాజు నేతృత్వంలో వంశీ అతని స్నేహితులు వచ్చే భక్తులకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఆ గణనాథుడి పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి రావాలని భద్రాద్రి కా మహారాజ్ కమిటీ వారు కోరారు. అన్నదాన దాత ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ ఉంగరాల వెంకట్రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.




