Khammam: జలగం నగర్ పాఠశాలలో ఘనంగా బాల పంచాయతీ కార్యక్రమం!

Khammam: ఖమ్మం రూరల్ పరిధిలోని జలగం నగర్ ప్రభుత్వ పాఠశాలలో AHTU బృందం ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ సమస్యలపై చర్చించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Nov 2026 8:37 AM IST
Khammam
X

Khammam: జలగం నగర్ పాఠశాలలో ఘనంగా బాల పంచాయతీ కార్యక్రమం!

Khammam: గౌరవనీయులైన ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్ గారి ఆదేశాల మేరకు AHTU ఇన్స్పెక్టర్ శివనాథుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు AHTU ఖమ్మం బృందం మరియు ఏఐడీఎన్జీవో తో కలిసి సంయుక్తంగా ఖమ్మం రూరల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జలగం నగర్‌ నందు బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో జలగం నగర్ పాఠశాలకు చెందిన 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 15 మంది విద్యార్థులను ఎంపిక చేసి బాల పంచాయతీలో సభ్యులుగా భాగస్వాములను చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు గ్రామంలో ఎదుర్కొంటున్న వివిధ బాలలకు సంబంధించిన సమస్యల గురించి స్వేచ్ఛగా చర్చించారు. ఆయా సమస్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ, వాటి పరిష్కార మార్గాలపై కూడా చర్చించి తగిన సూచనలు చేశారు.

విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమస్యలను గుర్తించి పరిష్కరించుకునే సామర్థ్యం మరియు తమ హక్కుల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ బాల పంచాయతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని వక్తలు తెలిపారు. బాలలు కార్యక్రమాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్, సిడబ్ల్యుసి సభ్యులు లక్ష్మయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాయుడు, ఎయిడ్ సేవా సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఏ హెచ్ టి యు బాధ్యులు భాస్కర్ షీ టీం సౌజన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్సన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.