Khammam: ఖమ్మంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ!
Khammam: ఖమ్మం శ్రీనగర్ కాలనీలో గురుస్వామి తిరుమలరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ వేడుక భక్తిశ్రద్ధలతో నిర్వహణ. పాల్గొన్న భక్తజనం, మహా అన్నదానం.
Khammam: ఖమ్మంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ!
Khammam: నగరంలోని శ్రీనగర్ కాలనీలో హనుమాన్ సింగ్ నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ వేడుక మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా సాగింది. గురుస్వామి గొలుసుల తిరుమలరావు ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మాలధారణ అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు.
గురుస్వామి తిరుమలరావు పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పడిపూజను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన అయ్యప్ప స్వాములకు, భక్తులకు ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రసాదాన్ని స్వీకరించారు. అయ్యప్ప నామస్మరణతో శ్రీనగర్ కాలనీ ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమంలో గురు స్వామిలు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, చింతకాయల అంజయ్య ,తాడబోయిన రాంబాబు, బరిగల శేఖర్, కట్ల నరసింహారావు ,బార్ అనిల్, బండి మనోజ్ ,ఐతనబోయిన వెంకట్రావు, ఏటుకూరు నవీన్, లక్ష్మణ్, కూచిపూడి మురళి తదితరులు పాల్గొన్నారు.




