Satthupalli: బుగ్గపాడులో వైభవంగా అయ్యప్ప స్వామి పీఠం, విగ్రహ ప్రతిష్ఠాపన!
Satthupalli: సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో వైభవంగా హరిహర పుత్ర అయ్యప్ప స్వామి పీఠం, విగ్రహ, కలశ స్థాపన మహోత్సవం. భారీ శోభాయాత్ర, అన్నప్రసాద వితరణ.
Satthupalli: బుగ్గపాడులో వైభవంగా అయ్యప్ప స్వామి పీఠం, విగ్రహ ప్రతిష్ఠాపన!
Satthupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి పీఠం,విగ్రహ,కలశ స్థాపన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా జరిగాయి. ప్రముఖ జ్యోతిష్య ఆగమ సిద్ధాంతి,గాయత్రీ ఉపాసకులు వెల్లటూరి ప్రసాద చారి గారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ ప్రతిష్ఠాపన క్రతువులు శాస్త్రోక్తంగా సాగాయి.
గ్రామానికి చెందిన బొడ్డు వాసుబాబు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేసిన స్థలంలో అయ్యప్ప స్వామి పీఠ నిర్మాణాన్ని పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వాయు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప గురుస్వామి రామడుగు బాలకృష్ణమాచారి,గ్రామ పురోహితులు అయ్యప్ప గురుస్వామి పర్వతపు నవీన్ శర్మల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
అంతకుముందు గ్రామ శివారులోని విశ్వధర్మ క్షేత్రంలో 60 మంది భక్తులు భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. అనంతరం 250 మంది భవానీ మాలధారులతో కలిసి,వాయు ప్రతిష్ఠ చేయనున్న అయ్యప్ప స్వామి విగ్రహంతో గ్రామంలో నేత్రపర్వంగా శోభాయాత్ర నిర్వహించారు.భక్తుల శరణుఘోషతో గ్రామం మార్మోగింది.
ప్రతిష్ఠాపన పూజల అనంతరం భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ వేడుకల్లో బుగ్గపాడుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు,అయ్యప్ప-భవాని దీక్షాపరులు,గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




