Aswaraopeta: అశ్వారావుపేటలో భక్తిశ్రద్ధలతో వాల్మీకి జయంతి వేడుకలు!

Aswaraopeta: అశ్వారావుపేటలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రూ.20 వేల విరాళాన్ని అందజేయగా నాయకులు పూజలు చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 26 Oct 2026 5:55 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేటలో భక్తిశ్రద్ధలతో వాల్మీకి జయంతి వేడుకలు!

అశ్వరావుపేట: అశ్వరావుపేట పట్టణంలోని వాల్మీకి ఆలయంలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి ప్రమోద్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ కట్టా సింధుజ లు వాల్మీకి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వాల్మీకి పూలమాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి భక్తికి నిదర్శనం వాల్మీకి అని అటువంటి మహనీయులను కొలుచుకోవడం మన అదృష్టమని స్పష్టం చేశారు.

వాల్మీకి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే విరాళం..

వాల్మీకి జయంతిని పురస్కరించుకొని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ వాల్మీకి జయంతిని పురస్కరించుకొని అశ్వరావుపేట పట్టణంలోని తూర్పు బజారులో వేంచేసి ఉన్న వాల్మీకి బోయ ఆలయ అభివృద్ధికి 20000/ లు నగదును అందజేశారు. ఈ నగదును నాలుగో వార్డ్ కౌన్సిలర్, కట్టా సింధుజ , జూపల్లి ప్రమోద్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తావని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నండ్రు రమేష్, మోర్ల వెంకన్న, వాల్మీకి బోయ సభ్యులు ముసికి వెంకటరమణ, నల్లబోతుల నాగరాజు, గుజ్జుల ఆనంద్, మహాలక్ష్మి, బొగ్గు లక్ష్మి, నల్లబోతుల సీతాకుమార్, నల్లబోతుల నాగు, పెనుసుల అంజి, గుజ్జుల కృష్ణకుమారి, నల్ల పోతుల సాంబ తదితరులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA