Aswaraopeta: చిలకలగండి ముత్యాలమ్మ ఆలయంలో మెచ్చా ప్రత్యేక పూజలు!

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటించారు. ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 1 Nov 2026 5:10 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: చిలకలగండి ముత్యాలమ్మ ఆలయంలో మెచ్చా ప్రత్యేక పూజలు!

అశ్వారావుపేట: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు, వినాయకపురం శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే అక్కడే డా.పూర్ణ చాంద్ గారు మొక్కులు చల్లించుకుంటున్న సందర్భంగా పాల్గొన్నారు.

పాత నారంవారిగూడెం గ్రామంలో పేరుబోయిన వెంకటేశ్వరరావు గారి మనవరాలు(పేరబోయిన రమేష్- చెల్లమ్మ దంపతుల కుమార్తెల) ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. పాపిడిగూడెంలో BRS నాయకులు,వార్డ్ మెంబర్ ఆళ్ల రాంబాబు గారి తండ్రి ఆళ్ల మల్లయ్య గారి దశ దిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జూపల్లి రమణారావు గారు, మాజీ MPP జల్లిపల్లి శ్రీరామమూర్తి గారు మోహన్ రెడ్డి గారు, యుఎస్ ప్రకాశ్ రావు గారు, సంక ప్రసాద్ గారు,స్థానిక BRS నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA