Chintoor: చింతూరు ఏజెన్సీని ముంచెత్తిన వరద ఉగ్రరూపం దాల్చిన శబరి నది!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నది ఉగ్రరూపంతో రాకపోకలు నిలిచిపోయాయి, లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 25 Sept 2026 12:33 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఏజెన్సీని ముంచెత్తిన వరద ఉగ్రరూపం దాల్చిన శబరి నది!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని వరద ముంచెత్తింది.గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నదిలో భారీగా నీరు చేరి క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతూ ఉగ్రరూపం దాల్చింది.శబరి నదికి అనుసంధానమైన కుయుగురు,సోకిలేరు, చంద్రవంక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ రహదారుల పై కెక్కి జలమయం చేశాయి.

కుయుగురు వాగు పొంగిపొర్లుతూ రహదారిని జలమయం చేయడంతో చింతూరు నుంచి ఒరిస్సా రాష్ట్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.సోకిలేరు వాగు రహదారి పైకెక్కి ప్రవహిస్తుండడంతో చింతూరు నుంచి వి.ఆర్ పురం మండలానికి రాకపోకలు స్తంభించాయి.శబరి నది ఉధృతంగా ప్రవహిస్తూ శబరినది ఒడ్డున ఉన్న సంతపాకల వీధిని ముంచెత్తింది.

వరద ముంపునకు గురైన బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.రహదారులు జలమయం కావడంతో శబరి పరివాహక లోతట్టు ప్రాంత గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.చింతూరు సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని ముంపు ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.శబరి వరద వలన చింతూరు ఏజెన్సీలోని ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR