Ashwaraopeta: నిరుపేద రైతు కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారే!
Ashwaraopeta: గుర్రాలచెరువులో చెరువులో పడి మరణించిన బాలుడు ప్రవీణ్ కుటుంబాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించి ఓదార్చారు.
Ashwaraopeta: నిరుపేద రైతు కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారే!
అశ్వారావుపేట: గుర్రాలచెరువు గ్రామంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. రైతు కూలీ కలపాల రామకృష్ణ కుమారుడు కలపాల ప్రవీణ్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు.
విషయం తెలుసుకున్న అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ హుటాహుటిన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి గుర్రాలచెరువు వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
సాధారణంగా నాయకులు ధనవంతులు, సెలబ్రిటీల ఇళ్లకే వెళ్తారనే అపవాదుకు భిన్నంగా, ఒక నిరుపేద రైతు కూలీ కుటుంబం వద్దకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పరామర్శించడం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
చిన్న కుటుంబాల కష్టం తన కష్టంగా భావించి అందరినీ కలుపుకుపోవడమే ఆయన ప్రత్యేకత అని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే వెంట తుమ్మ రాంబాబు, డాక్టర్ సత్యనారాయణ, ఆలా సత్తిబాబు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




