Ashwaraopeta: పట్టభద్రులారా.. ఎమ్మెల్సీ ఓటరుగా వెంటనే నమోదు చేసుకోండి!

Ashwaraopeta: అశ్వారావుపేటలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉచిత ఎమ్మెల్సీ ఓటరు నమోదు శిబిరం నిర్వహించారు. నవంబర్ 6 లోగా పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 15 Oct 2026 9:44 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: పట్టభద్రులారా.. ఎమ్మెల్సీ ఓటరుగా వెంటనే నమోదు చేసుకోండి!

అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని BRS కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, నాయకులు కాసాని చంద్రమోహన్, డాక్టర్ ప్రసాద్ రావు పిలుపునిచ్చారు.

కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి నివాస ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉచిత నమోదు శిబిరానికి స్థానిక పట్టభద్రుల నుంచి భారీ స్పందన లభిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... నవంబర్ 1, 2023 నాటికి గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఇతర సమాన స్థాయి చదువులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటుకు అర్హులని స్పష్టం చేశారు.

దరఖాస్తు చేయడానికి నవంబర్ 6 చివరి తేదీ అని గుర్తుచేశారు. పట్టభద్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, అర్హులందరూ ఈ అవకాశాన్ని వాడుకుని ఓటరుగా నమోదు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, నాయకులు గుడవర్తి వెంకటేశ్వరరావు, మొటూరి మోహన్, కృష్ణ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పట్టభద్రులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA