Ashwaraopeta: అశ్వారావుపేట బార్ షాప్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ దుబ్బాకుల నిర్మల!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో అశ్వారావుపేట 2బీ బార్ షాప్ లక్కీ డ్రా. పాల్వంచకు చెందిన దుబ్బాకుల నిర్మలకు దక్కిన టెండర్, ప్రభుత్వానికి రూ.3.57 కోట్ల ఆదాయం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Oct 2026 1:00 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వారావుపేట బార్ షాప్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ దుబ్బాకుల నిర్మల!

Ashwaraopeta: కొత్తగూడెం కలెక్టరేట్ సముదాయం IDOC లో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 2బీ బార్ షాప్ టెండర్ కోసం లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సమక్షంలో ఈ టెండర్ ప్రక్రియను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 2B బార్ షాప్ కు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.

లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ ద్వారా 357 మంది దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.3.57 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

అధికారుల సమక్షంలో దరఖాస్తుదారులకు సంబంధించిన టోకెన్లతో లక్కీ డ్రా నిర్వహించగా, 244 నంబర్ టోకెన్ గల పాల్వంచకు చెందిన దుబ్బాకల నిర్మల టెండర్ ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ కిషన్, తదితర ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM