Ashwaraopet: అశ్వారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!
Ashwaraopet: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాకాలగూడెంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్.
Ashwaraopet: అశ్వారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్!
Ashwaraopet: అశ్వారావుపేట మండలం పాకాలగూడెం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు గ్రామంలో గల 84 ఇండ్లలో తనిఖీలు నిర్వహించి (62) ద్విచక్ర వాహనాలు, (3) ఆటోలు, (4) ట్రాక్టర్లు తనిఖీ నిర్వహించి. సరైన రిజిస్ట్రేషన్ ధ్రువ పత్రాలు లేని (5) ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు నడప రాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా POCSO చట్టాలపై అవగాహన కలిగించారు.
పాల్వంచ DSP సతీష్ కుమార్ ఆదేశాలతో, ఈ కార్య క్రమంలో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ . నాగరాజు రెడ్డి , అశ్వారావుపేట SHO సాయి కిషోర్ రెడ్డి అశ్వారావుపేట అదనపు SI దేవ్ సింగ్ పాల్గొన్నారు.




