Ashwapuram: అశ్వాపురంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే పాయం

Ashwapuram: అశ్వాపురం మండల లబ్ధిదారులకు రూ.6.40 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పంపిణీ చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 21 Sept 2026 4:44 PM IST
Ashwapuram
X

Ashwapuram: అశ్వాపురంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వాపురం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.6 లక్షల 40 వేల రూపాయల విలువైన చెక్కులను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, సర్పంచులు మచ్చ నరసింహారావు, కుంజ జాను, ఉసా అనిల్, వేములపల్లి రమేష్, కాకా రాములు, తూము వీర రాఘవులు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, జనరల్ సెక్రెటరీ కంటెం నవీన్, తదితరులు పాల్గొన్నారు

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA