Ashwapuram: తుర్రంవారిగూడెంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Ashwapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుర్రంవారిగూడెంలో సర్పంచ్ కుంజ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం జరిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 14 Nov 2026 7:28 PM IST
Ashwapuram
X

Ashwapuram: తుర్రంవారిగూడెంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వాపురం మండలంలో దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి.. (బాలల దినోత్సవం) సందర్భంగా శుక్రవారం తుర్రంవారిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ కుంజ జాన్ మరియు ఉప సర్పంచ్ ధరావత్ హర్ష నాయక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నపిల్లలందరికీ ఉత్సాహాన్ని నింపేలా పెన్నులు మరియు బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా సాగిన ఈ కార్యక్రమం గ్రామస్థుల అభినందనలను అందుకుంది.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ యాకూబ్ గారు వార్డు సభ్యులు భూక్యా కాళిదాస్ గారు అంగన్వాడీ టీచర్ పూనం సుజాత గారు మరియు గ్రామ పెద్దలు, ఊకె రామయ్య గారు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు. చిన్నారుల చదువుతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి గ్రామ పంచాయతీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA