Ashwapuram: మారెళ్లపాడు ప్రాజెక్టు పేటెంట్ బీఆర్‌ఎస్‌దే: కోడి అమరేందర్

Ashwapuram: మారెళ్లపాడు ప్రాజెక్టు క్రెడిట్ బీఆర్‌ఎస్‌దేనని, మిగిలిన రూ.400 కోట్ల పనులను పూర్తి చేసి మండల రైతాంగానికి సాగునీరు అందించాలని నేతలు డిమాండ్ చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 21 Sept 2026 3:41 PM IST
Ashwapuram
X

Ashwapuram: మారెళ్లపాడు ప్రాజెక్టు పేటెంట్ బీఆర్‌ఎస్‌దే: కోడి అమరేందర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండలం.. బి.ఆర్.ఎస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ.... కెసిఆర్ కలల స్వప్నం సీతారామ ప్రాజెక్టు,రేగా కాంతారావు మానస పుత్రిక మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకమని కేవలం ఈ ప్రభుత్వంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో లెఫ్ట్ కెనాల్ మాత్రమే నిర్మించారని, తక్షణమే మిగిలిన పనులను ప్రారంభించి మారెళ్ళ పాడు రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు తరలించి,తద్వారా మండలంలోని అన్ని చెరువులను,కుంటలను నింపి మండలంలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలను అందించాలని,మండల రైతాంగానికి రాష్ట్ర మంత్రులు హామీ ఇవ్వాలని అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అశ్వాపురం మండల కేంద్రంలోని తెలంగాణా భవన్ లో మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మాట్లాడుతూ మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో మంజూరైన పథకమని.2023 జనవరిలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో తక్షణమే రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండేళ్లపాటు మారెళ్ళపాడు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.

ఈ ప్రాంత రైతుల త్యాగంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్విచ్లు వస్తే మోటార్లు ఆన్ చేసి గోదావరి జలాలను నెత్తిన చల్లుకొని ఖమ్మం జిల్లాకు నీళ్లు తరలించకు పోతుంటే, ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా చుక్క నీరు కూడా ఇక్కడి నుంచి తరలించేది లేదని బిఆర్ఎస్ పార్టీ హెచ్చరిక తో, స్థానిక రైతాంగంతో కలిసి బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరంతర పోరాటాల,ఆందోళనల ఫలితమే నేడు మారెళ్ళ పాడు లెఫ్ట్ కెనాల్ నిర్మాణమని ఆయన అన్నారు.

సాగునీళ్ల కోసం పోరాటం చేస్తుంటే మా పార్టీ నాయకులను జైలుకు పంపిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కేవలం మారెళ్ళ పాడు లెఫ్ట్ కెనాల్ పనులు మాత్రమే పూర్తయ్యాయని, 25 కోట్ల రూపాయల పనులకు మూడు సంవత్సరాలు పడితే మిగిలిన 400 కోట్ల రూపాయల పనులకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని,తక్షణమే నేడు అశ్వాపురం మండలానికి విచ్చేస్తున్న మంత్రులు మిగిలిన పనులను పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో స్వరాష్ట్రంలో కరువైనా,కాలమైనా రాష్ట్రంలో రైతాంగానికి సాగునీటి కొరత ఉండకూడదని, వృధాగా సముద్రానికి పోతున్న గోదావరి జిల్లాలను ఒడిసిపట్టి ఉమ్మడి ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాల్లోని రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి అన్నారు.

2005 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మండలంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారని,2005 నుండి 2014 వరకు వారు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు ఆ పనులు కాగితాలకే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించే డిజైన్ ఉన్న ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి తరలించే ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో 2017లో శంకుస్థాపన చేసిన సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు.

గత ప్రభుత్వం చేసిన నిర్మాణంతోటే కృషి తోటే నేడు గోదావరి జిల్లాలు బీడు భూములుగా మారిన సాగు భూములకు తరలుతున్నాయని ఆయన అన్నారు.

ఈ విషయం ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గత ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నారని వారికి తెలుసన్నారు. ఎన్ని మాయ మాటలు చెప్పిన సాగునీటి ప్రాజెక్టుల చిత్తశుద్ధి, రైతులపై చిత్తశుద్ధి ఉన్నది బిఆర్ఎస్ పార్టీకేనని అది రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలుసని ఆయన పేర్కొన్నారు.మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం పేటెంట్ బిఆర్ఎస్ పార్టీ కే చెందుతుందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి అన్నారు.

గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం 420 కోట్లతో మంజూరు అయిందని,ఈ పథకం డిజైన్ మారెళ్ళ పాడు రిజర్వాయర్కు నీటిని తరలించి అశ్వాపురం మండలంలోని ప్రతి ఎకరాకు,ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సాగుభూములతో సహా సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారన్నారు.25 కోట్ల పనులకు మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ మాత్రమే పూర్తయిందని, కేవలం ఆరు పంచాయతీల రైతుల సాగుభూమి తుమ్మలచెరువు ఆయకట్టుకు మాత్రమే నీరు అందుతుందని, మిగిలిన పనులను కూడా తక్షణమే పూర్తిచేసి అశ్వాపురం మండలంలోని అన్ని చెరువులు కుంటలు నింపి సాగు భూములకు నిరంధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిర్మాణం విషయంలో కూడా గత ప్రభుత్వంలో రూపొందించిన రూ.420 కోట్ల ప్రాజెక్టు డిజైన్‌నే కొనసాగించాలని ప్రస్తుతం డిజైన్‌లో మార్పులు చేయడం వల్ల భవిష్యత్తులో రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామపంచాయతీల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మిగిలిన పనులను ప్రారంభించాలని,లేనిపక్షంలో మండల రైతాంగంతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు...

ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,సీనియర్ నాయకులు ఈదరా సత్యనారాయణ,జాలే రామకృష్ణ రెడ్డి,కందుల కృష్ణార్జునరావు,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సూదిరెడ్డి గోపిరెడ్డి,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గ యువజన విభాగం ఉప అధ్యక్షుడు_జగ్గారం ఉప సర్పంచ్ లంకెల రమేష్,మండల యువజన అధ్యక్షులు గద్దాల రామకృష్ణ,సీనియర్ నాయకులు నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,నక్కనబోయిన పాపారావు,చిలక వెంకటరమయ్య,కల్యాణపురం సర్పంచ్ లకావత్ రామారావు,గొల్లగూడెం సర్పంచ్ కోండ్రు సోమయ్య,గొల్లగూడెం ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్,ఆనందాపురం ఉపసర్పంచ్ దేవనబోయిన మహేష్,మల్లెలమడుగు ఉప సర్పంచ్ గాడిద మహేష్,కల్యాణపురం ఉప సర్పంచ్ చల్లా రాజేష్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA