Palwancha: మరి కాసేపట్లో పాల్వంచకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు!

Palwancha: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి మరి కాసేపట్లో పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నారు. అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 26 Nov 2026 3:42 PM IST
Palwancha
X

Palwancha: మరి కాసేపట్లో పాల్వంచకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు!

పాల్వంచ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి మరి కాసేపట్లో పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్, పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు దంపతులు ఆలయానికి చేరుకుని సుమారు 30 నిమిషాల పాటు స్వామివారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసేందుకు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్వంచకు రానున్నట్లు సమాచారం. నవభారత్ కర్మాగారం ఎండీ దేవినేని అశోక్ సతీమణి రమ ఆహ్వానం మేరకు చంద్రబాబు దంపతులు పాల్వంచకు వస్తున్నట్లు తెలుస్తోంది. రమ, భువనేశ్వరి స్నేహితులు కావడం విశేషం.

ఇదిలా ఉండగా, నవభారత్ SVS టెంపుల్‌లో శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నేడు, రేపు సుదర్శన్ హోమం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4.30 గంటలకు విష్వక్సేన ఆరాధన, పూర్ణకుంభ స్వాగతం కార్యక్రమాలు జరగనున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు సుదర్శన్ హోమం, 9 గంటలకు తీర్థ గోష్ఠి, మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4.45 గంటలకు లక్ష్మీ నారాయణ స్వామి పూజ నిర్వహించనున్నారు. రేపు జరిగే సుదర్శన్ హోమంలో భువనేశ్వరి పాల్గొననున్నట్లు సమాచారం. ఆమె రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN