Kunavaram: కూనవరం మండలం భగవాన్ పురంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవాలు!

Kunavaram: కూనవరం మండలం భగవాన్‌పురంలో పోషణ మాసం అంగన్‌‌వాడీ ఉత్సవ్ నిర్వహించారు. ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించి కార్యకర్తలను సన్మానించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Sept 2026 2:16 PM IST
Kunavaram
X

Kunavaram: కూనవరం మండలం భగవాన్ పురంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవాలు!

Kunavaram: కూనవరం మండలం భగవాన్ పురం గ్రామంలో పోషణ మాసం అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు.సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సోయం సుధారాణి,మండల యువమోర్చా అధ్యక్షులు పూనెం సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.ఆరోగ్యం,పోషణ, సమగ్ర అభివృద్ధి,కేంద్ర ప్రభుత్వం పథకాలు,మిషన్ వాత్సల్య,మిషన్ శక్తి, సాక్ష్యం,పోషణ 2.0 మొదలగు అంశాల గురించి అవగాహన నిర్వహించారు.అంగన్వాడి కార్యకర్తలను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు,మండల ఉపాధ్యక్షులు బివిఎస్ నారాయణ,మినప శ్రీను, దుర్గ,విజయ,మంగ లు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR