Velerupadu: వేలేరుపాడులో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం!
Velerupadu: వేలేరుపాడు మండల కేంద్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న 15 మంది పారిశుధ్య కార్మికులను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
Velerupadu: వేలేరుపాడులో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం!
Velerupadu: మండల పరిధిలోని 9 పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులుగా సేవలందిస్తున్న 15 మంది కార్మికులను గుర్తించి ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీవో శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు పేర్కొన్నారు. గ్రామాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులను సత్కరించడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి సంజీవులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, సంయుక్త కార్యదర్శి బద్దుల శివరామ్ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీహరి, ప్రభుత్వ వైద్యుడు ఆయుర్వేదం,డాక్టర్ మౌనిక, ఈవోపీఆర్డీ దావీదు, సచివాలయం సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.




