Sathupalli: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి!

Sathupalli: నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు: నవంబర్ 15న భారీ బహిరంగ సభ, రైతుల సమస్యలపై పోరాటాలకు సత్తుపల్లి సీపీఎం నేత శీలం సత్యనారాయణ రెడ్డి పిలుపు

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 27 Sept 2026 11:42 PM IST
Sathupalli
X

Sathupalli: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి!

సత్తుపల్లి: అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నల్గొండ పట్టణంలో నవంబర్ 15, 16, 17,18 తేదీలలో జరుగుతున్నాయి, 15వ తేదీన జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఎం సత్తుపల్లి మండల కమిటీ సమావేశం ఆదివారం సత్తుపల్లిలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఎలగం కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతు రుణ భారం, సాగునీరు, ఎరువులు- విత్తనాల సమస్యలు, రైతు భూముల రక్షణ తదితర అంశాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు రైతాంగ పోరాటాలను కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

కేంద్ర, ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా విధానాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుందని అన్నారు. సాగునీటి సమస్యలు, సాగర్ జలాల విడుదల, కాలువలు మరమ్మతులు, నిత్యం రైతులను కదిలించి పోరాటం చేస్తుందన్నారు.

మొక్కజొన్న, వరి ధాన్యం, కొనుగోలు సమస్యలు, డబ్బుల విడుదల కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రైతులకు మద్దతుగా నిలుస్తుంది అన్నారు. పామాయిల్, చెరుకు రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయం చేయాలని ఉద్యమాలతో పాటు రైతుల బ్యాంకు రుణాలు, రుణమాఫీ సమస్యలు పరిష్కారం కోసం నిత్యం రైతులకు మద్దతుగా నిలిచే రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, పార్టీ మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, వేపులపాటి కుమారస్వామి, అయినంపూడి సునందరావు, కువ్వారపు లక్ష్మణరావు, ఎలగం రాములు, తడికమళ్ళ రామకృష్ణ , బండి వేలాద్రి, కావూరి వెంకటేశ్వరరావు, ముత్తిని శ్రీను, కొలికి పోగు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI