Julurupadu: జూలూరుపాడులో ఘనంగా అమరవీరుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు!
Julurupadu: జూలూరుపాడులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులర్పించిన యువజన సంఘం నాయకులు.
Julurupadu: జూలూరుపాడు AIYF మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119 వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం AIYF రాష్ట సమితి సభ్యులు sk చాంద్ పాషా మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకమని అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలియజేసే బాధ్యత పాలకులదని భగత్ సింగ్ జయంతి నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాల నేడు దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశాన్ని దోచుకుంటున్నారని భారతదేశ స్వతంత్రం కోసం చేసిన పోరాటం ఆలోచనలు భగత్ సింగ్ చూపిన కార్యచరణ నేటి స్ఫూర్తికి ప్రతిరూపం గా విద్యార్థులు యువత ఉద్యమించాలని కోరారు ఈ కార్యక్రమం లో AIYF మండల కార్యదర్శి చలగొండ్ల సతీష్, సురేష్ గోపి మోహన్ sk యాకూబ్ పాషా వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




