Kothagudem: ఖమ్మంలో ఏఐకేఎంఎస్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ!
Kothagudem: ఖమ్మంలో సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పోస్టర్లు ఆవిష్కరించారు.
Kothagudem: ఖమ్మంలో ఏఐకేఎంఎస్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ!
Kothagudem: కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయకరంగాన్ని దివాలా తీపించి మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయకరంగాన్ని బహుళ జాతి కంపెనీలకు అంబానీ ఆదానీలకు కట్టబెడుతుంది. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని యూరియా యాప్ ను రద్దు చేయాలని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని, AiKMS అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ నాయకులు మట్ట నరసింహరావు పిలుపునిచ్చారు.
అందులో భాగంగా ఈరోజు చర్ల మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ రైతులతో మహిళలతో జరపడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రైతుల కు గిట్టుబాటు ధర కల్పించాలని, మొక్కజొన్న కింటకు 3000, పత్తి 15000 ఇవ్వాలని కోరుతూ అందులో భాగంగానే ఖమ్మంలో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి.
ఈ మహాసభలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నాయకులు కుంజ జోగారావు సంతపూరి సురేష్ గొంది మూయన్న కొండ స్వామి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




