Khammam: ఖమ్మంలో ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్!

Khammam: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని శిక్షణ కేంద్రంలో బుధవారం సజావుగా ప్రారంభమైంది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Nov 2026 5:53 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్!

Khammam: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు హాజరవుతున్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

వెరిఫికేషన్ కోసం వచ్చే బాధితులకు క్రమబద్ధంగా సేవలు అందించేలా, రద్దీ లేకుండా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. బాధితులు తమకు కేటాయించిన తేదీల ప్రకారం హాజరై, ముందుగా క్రమపద్దతిలో టోకెన్ తీసుకుని సంబంధిత బాండ్ పత్రాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి వెరిఫికేషన్ ప్రక్రియను క్యూ లైన్ లో సజావుగా పూర్తి చేస్తున్నారు.

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శామీనాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సిసీఎస్ ఏసీపీ సర్వర్ ఆధ్వర్యంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వెరిఫికేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.