Aswapuram: రామచంద్రపురంలో రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సు!

Aswapuram: అశ్వాపురం మండలం రామచంద్రపురంలో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారుల సూచన.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 13 Oct 2026 1:25 PM IST
Aswapuram
X

Aswapuram: రామచంద్రపురంలో రైతులకు పంటల సాగుపై అవగాహన సదస్సు!

Aswapuram: రామచంద్రపురం గ్రామంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ భూరెడ్డి స్వాతి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారి ఏడీఓ తాతారావు , ఏఈ రమ్య రైతులకు పంటల సాగుపై పలు సూచనలు చేశారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తక్కువగా ఉన్నందున, వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు మరియు ఇతర అనుకూల పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుని, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూరెడ్డి స్వాతి వార్డు సభ్యులు, వ్యవసాయ అధికారులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA