Chintoor: ఏజెన్సీ కీర్తి జాతీయ స్థాయికి ఢిల్లీ పోటీలకు ఎంపికైన కుంజ దివ్య

Chintoor: పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలానికి చెందిన గిరిజన విద్యార్థిని కుంజ దివ్య రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో స్వర్ణం సాధించి, జాతీయ స్థాయికి ఎంపికైంది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 15 Oct 2026 11:29 AM IST
Chintoor
X

Chintoor: ఏజెన్సీ కీర్తి జాతీయ స్థాయికి ఢిల్లీ పోటీలకు ఎంపికైన కుంజ దివ్య

Chintoor: రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో గిరిజన బిడ్డ కుంజ దివ్య సత్తా చాటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని జాతీయ స్థాయికు ఎంపికైంది. దివ్య జాతీయ స్థాయికి ఎన్నికవ్వడం పట్ల చింతూరు ఏజెన్సీ పేరు జాతీయస్థాయికి ఎగబాకింది. వి ఆర్ పురం మండలం సోములగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో కుంజ దివ్య ఎనిమిదవ తరగతి చదువుతుంది.

ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు పల్నాడు జిల్లా కారేంపూడి లో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో ప్రతిభ చాటి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నట్లు పిఈటి శివకుమార్ తెలిపారు.ఈనెల 30 నుంచి నవంబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి కుస్తీ పోటీలలో దివ్య పాల్గొనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళి మనోహర్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR