Pinapaka: డీపీఓకు వినతిపత్రం సమర్పించిన జాతీయ ఆదివాసీ గిరిజన సంఘం
Pinapaka: పినపాకలో భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారికి జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు గొగ్గల ఆర్కే దొర వినతిపత్రం ఇచ్చారు.
Pinapaka: డీపీఓకు వినతిపత్రం సమర్పించిన జాతీయ ఆదివాసీ గిరిజన సంఘం
పినపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, పింఛన్ వెరిఫికేషన్ కు పినపాక మండలంకు విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి (DPO) గారిని మర్యాదపూర్వకంగాN కలిసిన జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గొగ్గల ఆర్కే దొర పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను
ఏజెన్సీ ప్రాంతంలో గ్రామపంచాయతీ ప్రధమ పౌరులైన గౌరవ సర్పంచులకు, నిబద్ధతతో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఒత్తిళ్ల ను, దాడులను పలు రకాల సమస్యలపై వివరించి...
ఇట్టి సమస్యలను సంబంధిత శాఖ ఉన్నత అధికారులకు, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గౌరవ శ్రీమతి దేవరాజన్ దివ్య IAS గారి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లి
ఏజెన్సీ ప్రాంతాలలో వున్న PESA చట్టాన్ని 100% అమలు అయ్యేలా నివేదిక ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు. PESA చట్టం సంపూర్ణ స్థాయిలో అమలు అయ్యేంత వరకు జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో దశల వారిగా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.




