Bayyaram: బయ్యారం, గార్ల మండలాల్లో తీవ్రమైన కోతుల బెడద.. ప్రజల ఆందోళన!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో కోతుల బెడద తీవ్రమైందని, దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆదివాసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 3 Nov 2026 12:54 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం, గార్ల మండలాల్లో తీవ్రమైన కోతుల బెడద.. ప్రజల ఆందోళన!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల _బయ్యారం మండల కేంద్రాలలో వివిధ గ్రామాలలో కోతుల గుంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు , కోతుల సమస్య పరిష్కరించాలని ఆదివాసి నాయకులు మెస్సు రాజశేఖర్ , ఇర్ప రామారావు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలను, కూరగాయలను సాగు చేసే పరిస్థితి లేకుండా పోతుందని కోతుల బెడదతో పండ్ల మొక్కలను నాశనం చేస్తున్నాయని, కూరగాయలను పిందెలను కొరికేయడం, తీగలను గుంజేయటం వల్ల కూరగాయల సాగు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని, వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోతుందని కోతుల ఇబ్బంది వల్ల రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన.

మహిళ కిరాణా షాపుకు వెళ్లి నిత్య అవసరపు సరుకులు తీసుకొస్తున్న అప్పుడు కోతులు మీద పడి కరుస్తున్నాయని,చేతిలోని కవర్లు లాక్కొని పోతున్నాయని, కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు కోతులు మీద బడి కరుస్తున్నాయని, బయటికి వెళ్లాలంటే భయ మేస్తుందని అంటున్నారు, పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే కోతుల మీద పడి కరుస్తున్నాయని, పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని అన్నారు,

గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామం నుండి గార్ల పట్టణానికి బైకుపై వెళ్తున్న గుండేటి రమేష్- సుగుణ దంపతులను కోతుల గుంపు దాడి చేయగా బైకు ఆదుపుతప్పి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు గార్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు. కోతులు బెడదతో గ్రామాలలో నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమేష్.

ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు మెస్సు రాజశేఖర్ దొర, పటేల్ పులసం రమేష్, కొట్టెం పుల్లయ్య, ఇర్ప రామారావు, వట్టం శ్రీనివాస్, చాట్ల సంపత్, చాట్ల అశోక్, సూరపాక వెంకటేష్,చింత నరేందర్, పరిషక రమ, కొట్టెం శాంత, చింత వినోద, తాటి అమల, తదిరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM