Bhadrachalam: భద్రాచలంలో మంత్రి పొంగులేటిని కలిసిన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక!
Bhadrachalam: భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక నేతలు కలిశారు.
Bhadrachalam: భద్రాచలంలో మంత్రి పొంగులేటిని కలిసిన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక!
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భద్రాచలం పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో *భద్రాచలం ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆదివాసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానంగా *భద్రాచలం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 15/Pలో ఉన్న 1.55 ఎకరాల భూమిని స్వాతంత్ర్య సమరయోధులు, ఆదివాసీ యోధులు భగవాన్ బిర్సా ముండా, కోయ బెబ్బులి సోయం గంగులు విగ్రహాల ప్రతిష్ఠాపన*కోసం కేటాయించాలని కోరారు.
అలాగే, ఇటీవల హత్యకు గురైన తెల్లం శరత్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణకు కీలకమైన 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారి నిర్మాణ ప్రతిపాదనను ఆదివాసీ సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ రహదారి నిర్మాణం పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో *తెల్లం రమణయ్య, కుంజా ధర్మారావు, గుండు శరత్, కుంజా శ్రీనివాసరావు, వీసాల కృష్ణయ్య, కొండ్రు వీరస్వామి, గొంది బాలయ్య, కుంజా సంతోష్, జగ్గ పుల్లయ్య, పాయం సత్యనారాయణ, కోర్సా చినబాబుదొర, కొండ్రు సుధారాణి, శీలం దుర్గ, నిట్టా రాజు, పూజారి కొండలరావు, పిట్టల బేబీరాణి, తెల్లం రఘు, కోర్సా రవి తదితర ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.




