Kothagudem: నవంబర్ 30న దమ్మపేట తహసిల్దార్ కార్యాలయం ముట్టడి!

Kothagudem: 1/70 చట్టం పరిరక్షణకై నవంబర్ 30న దమ్మపేట తహసిల్దార్ కార్యాలయ ముట్టడికి ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 6 Nov 2026 2:03 PM IST
Kothagudem
X

Kothagudem: నవంబర్ 30న దమ్మపేట తహసిల్దార్ కార్యాలయం ముట్టడి!

Kothagudem: ఈరోజు సుధాపల్లి లో ఆదివాసి ఐక్య కార్యాచరణ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆదివాసి సంఘాల మండల అధ్యక్షుడు సోయం మోహన్ మాట్లాడుతూ 1/70 చట్టాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలీ ఆదివాసి చట్టాలను రక్షించాలీ ఈనెల 30 న దమ్మపేట తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి ని విజయవంతం చేయడానికి వేలాదిగా బారి సంఖ్యలో ఆదివాసీల తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీల హక్కులు చట్టాలను హరించాలని చూస్తే సహించేది లేదని 1/70 చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో గిరిజనేతరులు వేసిన పిటిషన్ వాపస్ తీసుకోవాలని లేనిపక్షంలో తగిన సమయంలో వారికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేసిన గిరిజనేతరుల పై వేధింపులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు, బండారు సూర్యనారాయణ కొర్సా వెంకటేష్ దొర, గడ్డం వెంకటేశ్వరరావు, వాసం వెంకటేశ్వరరావు, కుంజా చిన్నబాబు,కుర్సం చిన్నరాజు తాటి రాము తోలెం శ్రీను, కారం బోడయ్య,పద్ధం విజయలక్ష్మి,మడకం ప్రసాద్ వెలకం అంజి,కేసరి వెంకటస్వామి దారబోయిన పోతురాజు ఉమ్మల సోమిరెడ్డి కొర్సా వీదరాజు, సోయం నాగరాజు, మోకాల విత్తేజ్ కీసరి రవి తదితరులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA