Khammam: ఏసీబీ వలలో సివిల్ సప్లై ఆఫీసర్ నరసింహారావు అరెస్ట్!
Khammam: మహబూబాబాద్ సివిల్ సప్లై ఆఫీసర్ నరసింహారావును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో సోదాలు.
Khammam: ఏసీబీ వలలో సివిల్ సప్లై ఆఫీసర్ నరసింహారావు అరెస్ట్!
Khammam: మహబూబాద్ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ వాసంశెట్టి నరసింహరావు ను అరెస్ట్ చేసిన ACB డిఎస్పి రమేష్.. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్,(ఫుల్ అడిషనల్* చార్జ్),అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావును ఖమ్మం ACB డి.ఎస్.పి . రమేష్ ఖమ్మం లో ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు..
ఆతని పై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు అందడంతో ACB రంగంలోకి దిగి, ఆయన ఆఫీసు,ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా అయన బంధువుల ఇళ్లలో విస్తృతంగా సోదాలునిర్వహించారు.విలాసవంతమైన భవనాలు భారీగా అక్రమాస్తుల గుర్తించారు..
వాసంశెట్టి నరసింహారావు అనేక జిల్లాలో పనిచేశారని వివిధ ప్రాంతాల్లో ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని ఎసిబి అధికారులు తెలిపారు.. నరసింహారావు ఇప్పటివరకు 15ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా 7ప్రాంతాల్లో బంధువులు, బినామిలా ఇళ్లలో సోదాలు చేయగా
ఇప్పటి వరకు ఖమ్మంలో 2విలాసవంతమైన భవనాలను గుర్తించామని 4మద్యం బాటిల్స్,19వేల నగదు, బంగారాన్ని సోదాల్లో గుర్తించినట్లు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ లో కూడా కొన్ని ఆస్తులను గుర్తించినామని అన్ని ప్రాంతాల్లో సోదాలు పూర్తయిపోయిన తర్వాత వివరాలు తెలియజేయనున్నట్లు ఎసిబి డీఎస్పీ రమేష్ తెలియజేసారు..




