Palwancha: పాల్వంచ కేఎస్పీ రోడ్డులో ఘనంగా 'ఆశీర్వాద్ దీపం' కార్యక్రమం!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేఎస్పీ రోడ్డులో ఘనంగా 'ఆశీర్వాద్ దీపం' కార్యక్రమం.. పాల్గొన్న బీజేపీ నాయకులు, మహిళలు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Updated on: 18 Sept 2026 4:47 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ కేఎస్పీ రోడ్డులో ఘనంగా 'ఆశీర్వాద్ దీపం' కార్యక్రమం!

Palwancha: పాల్వంచ పట్టణంలోని కేఎస్పి రోడ్డులో బేతం శెట్టి వెంకట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ మండపంలో గురువారం రాత్రి సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశీర్వాద దీపాన్ని వెలిగించారు.

మోదీ రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భక్తులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బేతం శెట్టి వెంకట్ తెలిపారు.

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన భక్తులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వా అపర్ణ, మహిళా మోర్చా నాయకురాలు సునీత, ఐటీ కన్వీనర్ జైకృష్ణ, సర్దార్, సురేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భారతి, సుజిత తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN