Bhadrachalam: 73 ఏళ్ల పవర్లిఫ్టర్ డి.వి. శంకరరావు విజయగాథకు మరో అరుదైన గుర్తింపు!

Bhadrachalam: భద్రాచలానికి చెందిన 73 ఏళ్ల ప్రపంచ మాస్టర్స్ పవర్లిఫ్టింగ్ పతక విజేత డి.వి. శంకరరావు విజయగాథకు మరో గుర్తింపు లభించింది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 19 Nov 2026 12:54 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: 73 ఏళ్ల పవర్లిఫ్టర్ డి.వి. శంకరరావు విజయగాథకు మరో అరుదైన గుర్తింపు!

Bhadrachalam: భద్రాచలం నవంబర్ 19-అమెరికాలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన భద్రాచలం నివాసి, 73 ఏళ్ల రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి డి.వి. శంకరరావు క్రీడా ప్రస్థానం ఇప్పుడు పోటీ పరీక్షల కరెంట్ అఫైర్స్ విభాగంలోనూ చోటు సంపాదించింది.

పోటీ పరీక్షలకు శిక్షణ, అధ్యయన సామగ్రి అందించే Exampur విద్యాసంస్థ 17 నవంబర్ 2026న తన Current Affairs – Sports వెబ్‌సైట్‌లో శంకరరావు ప్రపంచ విజయాలపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, పోటీ పరీక్షల సాధన కోసం రూపొందించిన ప్రశ్నల్లో ఆయన పేరు, ప్రపంచ పతకాలు, బరువు విభాగం వివరాలను కూడా చేర్చింది.

2012 సెప్టెంబరులో 59 ఏళ్ల వయసులో గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న శంకరరావు, 2025 ఫిబ్రవరిలో 71 ఏళ్ల వయసులో వ్యాయామశాలలో శిక్షణ ప్రారంభించారు. అదే ఏడాది ఆగస్టులో కేరళలోని కోజికోడ్‌లో జరిగిన జాతీయ పవర్లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సహా నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు.

అనంతరం 2026 అక్టోబరులో అమెరికాలోని నెవాడా రాష్ట్రం, రెనో నగరంలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాస్టర్స్–4, 74 కిలోల విభాగంలో అక్టోబర్ 15న క్లాసిక్ ఓవరాల్ కాంస్యం, అక్టోబర్ 22న ఎక్విప్డ్ ఓవరాల్ వెండి పతకాలు సాధించారు.

శంకరరావు స్ఫూర్తిదాయక క్రీడా ప్రస్థానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించాలని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకటరావు గారు ఇప్పటికే సిఫారసు చేశారు.

నా ప్రపంచ పతకాల విజయాన్ని విద్యార్థుల కరెంట్ అఫైర్స్ సాధనలో ప్రస్తావించడం నాకు ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. వయసుతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణతో కొత్త లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశం యువతకు చేరితే అదే నా విజయానికి నిజమైన సార్థకత అని శంకరరావు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem