Sathupalli: సత్తుపల్లి అయ్యప్ప ఆలయంలో 60 రోజుల అన్నదానం ప్రారంభం

Sathupalli: సత్తుపల్లి శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి ఆలయంలో 60 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం కమల్ పాషా దంపతులు ప్రారంభించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 25 Oct 2026 9:10 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి అయ్యప్ప ఆలయంలో 60 రోజుల అన్నదానం ప్రారంభం

సత్తుపల్లి: శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి దేవాలయం సత్తుపల్లి నందు ఆదివారం సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం కమల్ పాషా దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, దీక్షాదారులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన 60 రోజుల అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు దోసపాటి అమరలింగేశ్వర రావు శేషు వస్త్రంతో అతిధులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వకౌన్సిలర్స్ విరివాడ నాగభూషబం, హాకింపాషా, శ్రీనివాస్, రాము, ఆలయ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షుడు దురిశేటి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి పోలిశెట్టి శ్రీ శివకుమార్, అన్నదాన కమిటి ఇంచార్జీ భీమిశెట్టి శ్రీనివాసరావు, రావి నాగేశ్వరరావు, వడ్లపట్ల ఫణి కుమార్ , గాధంశెట్ఠీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI