Khammam: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు: ఖమ్మంలో వ్యాస రచన పోటీలు!

Khammam: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా ఆధ్వర్యంలో బుధవారం వ్యాస రచన పోటీలు నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 18 Nov 2026 10:59 PM IST
Khammam
X

Khammam: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు: ఖమ్మంలో వ్యాస రచన పోటీలు!

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం (DCL), ఖమ్మంలో పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ రచనా ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ ఖాదర్ బాబా మాట్లాడుతూ, విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడం, భాషా పరిజ్ఞానాన్ని మరియు రచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు పుస్తక పఠనానికి కూడా సమయం కేటాయించాలని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాస రచన పోటీలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీయడానికి చక్కని వేదికగా నిలుస్తాయని, చిన్న వయస్సు నుంచే చదవడం, రాయడం అలవాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని చైర్మన్ పేర్కొన్నారు.

విద్యార్థుల నుంచి లభించిన విశేష స్పందన పట్ల చైర్మన్ సంతోషం వ్యక్తం చేస్తూ, జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధితో పాటు విద్యార్థులు, యువతలో విజ్ఞానాభివృద్ధికి జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి. పద్మజ, గ్రేడ్-I గ్రంథపాలకులు సి. మాల్సూర్, గ్రేడ్-III గ్రంథపాలకులు బాబు, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ పి. సంతోష్, ఇతర గ్రంథాలయ సిబ్బంది, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.