Bhadradri: రోడ్డు, కరెంట్ లేక అడవి మార్గంలో బడికి వెళ్తున్న చింతకుంట విద్యార్థులు!

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామంలో 37 కుటుంబాలు 30 ఏళ్లుగా రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి

G Ravi, Bhadradri
Published on: 25 Nov 2026 11:36 AM IST
Bhadradri
X

Bhadradri: రోడ్డు, కరెంట్ లేక అడవి మార్గంలో బడికి వెళ్తున్న చింతకుంట విద్యార్థులు!

బూర్గంపహాడ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....బూర్గంపాడు మండలం స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు అందని దుస్థితి నెలకొంది. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో 37 కుటుంబాలు గత 30 ఏళ్లుగా కనీస మౌలిక సదుపాయాలకు దూరంగా జీవిస్తున్నాయి.

గ్రామానికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అడవి మార్గంలో సుమారు కిలోమీటరున్నర దూరం చెప్పులు లేకుండా నడుచుకుంటూ రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

మూడు దశాబ్దాలుగా తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చింతకుంట గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యాలు కల్పించి తమ కష్టాలను తీర్చాలని 37 కుటుంబాల ప్రజలు కోరుతున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri