Kamanpur: గంజాయి మహమ్మారిని యువత తరిమేయాలి: వైనాల రాజు!
Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారంలో 'గంజాయి మహమ్మారిని తరిమేద్దాం' లఘు చిత్రాన్ని వైనాల రాజు, సర్పంచ్ జంగిలి పోచాలు బుధవారం ప్రారంభించారు.
Kamanpur: గంజాయి మహమ్మారిని యువత తరిమేయాలి: వైనాల రాజు!
మంథాని: గంజాయి మహమ్మారిని తరిమేసే బాధ్యత ప్రతి యువకునిపై ఉందని కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వైనాల రాజు, గుండారం సర్పంచ్ జంగిలి పోచాలు అన్నారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామంలో ప్రముఖ నృత్య దర్శకుడు పులిపాక దేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'గంజాయి మహమ్మారిని తరిమేద్దాం' అనే లఘు చిత్రాన్ని బుధవారం ప్రారంభించారు.
ఈ చిత్రంలో సీనియర్ పాత్రికేయుడు జబ్బార్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పదవీ విరమణ చేసిన సహాయ ఉప నిరీక్షకుడు రవీందర్ రావు, ప్రముఖ దర్శకుడు కుమార్ పటేల్, రేఖా రెడ్డి, మానస, స్వరూప, బేబీ సిరి, గుగులోతు తిరుపతి, మడిపోజు సతీష్, చల్మల్ల శంకర్, అశ్వక్ ఖాన్, చంటి రమాకాంత్, నరేష్, కాంపల్లి రాజేష్, కంక సునీల్ తదితరులు పాత్రలు వహిస్తున్నారు. అలాగే వైద్య నరేష్ ఛాయాగ్రాహకుడిగా, కూర్పరిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా వైనాల రాజు, జంగిలి పోచాలు మాట్లాడుతూ.. నేడు సమాజంలో గంజాయి మహమ్మారితో యువత చెడిపోతుందని, గంజాయి మహమ్మారిని అందరూ కలిసి లేకుండా చేయాలని పేర్కొన్నారు. నేడు ఆరక్షక శాఖ సైతం గంజాయి మహమ్మారిని తరిమేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, వార్డు సభ్యుల ఫోరం మంథని డివిజన్ ఇంచార్జ్ చొప్పరి సంతోష్, వార్డు సభ్యులు దామెర దేవయ్య, బొడ్డు రవి, గాదె లత తదితరులు పాల్గొన్నారు.




