Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పినాకిల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు దీపావళి సందర్భంగా దీపం ఆకృతిలో నిలబడి ప్రదర్శించిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 4:58 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన!

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుమాల బైపాస్ రోడ్డులో గల పినాకిల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపం ఆకృతిలో నిలబడి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులంతా కలిసి రూపొందించిన దీపం ఆకృతి తల్లిదండ్రులను, చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మహమ్మద్ ఖైస్ మాట్లాడుతూ.. దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, వెలుగులు నింపాలని, విద్యార్థుల భవిష్యత్తు కూడా దీపంలా ప్రకాశించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA