Sircilla: గుర్తింపు కార్డులు లేనివారికి ఇళ్లు ఇవ్వొద్దు: డీఎస్పీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో టైల్స్ యజమాని పవన్ హత్య కేసును 12 గంటల్లో ఛేదించి, యూపీకి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sircilla: గుర్తింపు కార్డులు లేనివారికి ఇళ్లు ఇవ్వొద్దు: డీఎస్పీ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో టైల్స్ వర్క్ యజమాని పవన్ హత్య కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. డబ్బుల కోసం హత్యకు పాల్పడి పరారైన ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు జోగిందర్, శివమ్లను రామగుండం రైల్వే స్టేషన్లో పట్టుకుని అరెస్ట్ చేశారు.
సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టి నిందితులను పట్టుకుంది. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కత్రోజు నాగేంద్రచారి వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.
గుర్తింపు కార్డులు లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు.. డీఎస్పీ హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటి యజమానులకు డీఎస్పీ నాగేంద్రచారి కీలక సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుర్తింపు కార్డులు లేకుండా ఇళ్లు లేదా గదులు అద్దెకు ఇవ్వొద్దని హెచ్చరించారు. అద్దెకు దిగేవారి ఆధార్, పాన్ కార్డుల వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించి, వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందించాలని సూచించారు.
పోలీసు వెరిఫికేషన్ అనంతరమే గదులు కేటాయించాలని స్పష్టం చేశారు. గుర్తింపు వివరాలు సరిచూసుకోకుండా అద్దెకు ఇచ్చిన సందర్భంలో, సంబంధిత వ్యక్తులు నేరాలకు పాల్పడితే ఇంటి యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.




