Sircilla: ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం

Sircilla: ఎల్లారెడ్డిపేటలో రేపాక రామచంద్రారెడ్డి అధ్యక్షతన బీజేపీ సమావేశం. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక.

KALEEM, SIRICILLA
Published on: 17 Oct 2026 6:27 PM IST
Sircilla
X

Sircilla: ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.

స్థానిక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ కోతలు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు, మహిళలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA