Yellareddypet: మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నవంబర్ 23న కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టనున్న మహా పాదయాత్రపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Nov 2026 4:42 PM IST
Yellareddypet
X

Yellareddypet: మహా పాదయాత్ర విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం!

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మహా పాదయాత్రను విజయవంతం చేసే లక్ష్యంతో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. ఈ నెల 23న నిర్వహించనున్న మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు వివరించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల సాధన కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాయికిరణ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ, మండల ప్రధాన కార్యదర్శి సింగరేణి కృష్ణహరి, వివిధ మోర్చాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA