Sircilla: ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన 50 మంది నాయకులు, కార్యకర్తలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్.

KALEEM, SIRICILLA
Published on: 1 Nov 2026 1:00 PM IST
Sircilla
X

Sircilla: ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరారు. టిఆర్ఎస్ నాయకురాలు మంతాపురం పద్మ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్, మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు కులేరి మౌనిక, ముస్లిం అధ్యక్షుడు హాజీ బాబా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరడానికి ముందు నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం టిఆర్ఎస్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ అధినేత కవితక్క చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార ఉద్యమానికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కవితక్క ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.

కవితక్కను ముఖ్యమంత్రిని చేయడానికి మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, యువతీ యువకులు, నిరుద్యోగులు, కవులు, రచయితలు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు సహా రాష్ట్రంలోని అనేక మంది టిఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మజీద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అల్లె శంకర్, చిన్ని బాల్ రెడ్డి, బొమ్మనవేణి పరుశరాములు, కొర్రి రమేష్, ఓర్సు అశోక్, వట్టెల దేవేందర్, షబానా, పోచంపల్లి అమల, వంజరి ప్రతిభ, వట్టెల రజిత, లాస్య, రజిత, బుజ్జవ్వ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA