Sircilla: ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం పురుగుల మందు డబ్బాతో నిరసన!
Sircilla: ఇందిరమ్మ ఇంటి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీర్నపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మహిళ పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది.
Sircilla: ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం పురుగుల మందు డబ్బాతో నిరసన!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన బట్టు రోజా మాన్య నాయక్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లుల విషయంలో సమస్య తలెత్తడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇంటి నిర్మాణంలో భాగంగా ప్రారంభంలో బేస్‌మెంట్ బిల్లు రెండుసార్లు డిపాజిట్ కావడంతో అధికారులు బిల్లును హోల్డ్‌లో పెట్టినట్లు బాధితురాలు తెలిపారు. అనంతరం ఇంటి గోడలు, స్లాబ్ నిర్మాణం పూర్తయినప్పటికీ.. ఇప్పటివరకు తదుపరి బిల్లులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుల కోసం కలెక్టరేట్‌తో పాటు MPDO కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు పెరగడంతో వాటిని తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలో సోమవారం MPDO కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పురుగుల మందు డబ్బాతో వచ్చిన బాధితురాలు.. తనకు రావాల్సిన ఇంటి నిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ నిరసన తెలిపారు. తన సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని వేడుకున్నారు.




