Peddapalli: పూసల సంఘం భవనానికి ఎంపీ నిధులు: గడ్డం వంశీ

Peddapalli: పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించడంతో పాటు బోర్వెల్ వేయిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

RAJU, PEDDAPALLI
Published on: 25 Oct 2026 5:01 PM IST
Peddapalli
X

Peddapalli: పూసల సంఘం భవనానికి ఎంపీ నిధులు: గడ్డం వంశీ

పెద్దపల్లి: పూసల సంఘం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కుమారస్వామి గారికి, నూతన కార్యవర్గ సభ్యులందరికీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పూసల సంఘం ప్రతినిధులతో సమావేశమైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు, సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

గతంలో పూసల సంఘం భవన నిర్మాణం కోసం సంఘం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని గుర్తుచేస్తూ, పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి అవసరమైన నిధులను కేటాయించేందుకు కృషి చేస్తానని, సంఘం అవసరాల దృష్ట్యా బోర్వెల్ కూడా వేయిస్తానని హామీ ఇచ్చారు.

పూసల సంఘం సభ్యుల ఐక్యత, సంఘం అభివృద్ధి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, నూతన కార్యవర్గం సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పూసల సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు స్పష్టం చేశారు.

సంఘం అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం చేస్తున్న కృషికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI