Manthani: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంథని ఎఫ్‌ఆర్‌ఓ

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వన్యప్రాణులను కాపాడాలని ఎఫ్‌ఆర్‌ఓ ఎం.వి. నాయక్ పిలుపునిచ్చారు.

SHANKAR, MANTHANI
Published on: 2 Oct 2026 7:04 PM IST
Manthani
X

Manthani: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంథని ఎఫ్‌ఆర్‌ఓ

Manthani: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంథని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎం.వి. నాయక్‌ అన్నారు. పెద్దపల్లి డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని ఖాన్సాయిపేట, భట్‌పల్లి గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌, రైడ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులకు వన్యప్రాణి వారోత్సవాలపై అవగాహన కల్పించారు. అడవులను నరికివేయడం, వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని నాయక్‌ తెలిపారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం శివ్వారం వన్యప్రాణి అభయారణ్యంలో క్లీనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఏక్లాస్‌పూర్‌ అటవీ ప్రాంతంలోనూ గ్రామస్తులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎఫ్‌ఆర్‌ఓ టి. సతీష్‌కుమార్‌తో పాటు మంథని, పెద్దపల్లి రేంజ్‌ల డిప్యూటీ రేంజ్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI